కడియం మండలం కడియపుసావరం గ్రామానికి చెందిన ద్వారపూడి పెద్ద ఇటీవల క్యాన్సర్ కారణంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న తమని ఆదుకోవాలని రాజమండ్రి ఎంపీ పురందేశ్వరిని కుటుంబ సభ్యులు కోరారు. దీంతో ఆమె వెంటనే స్పందించి సంబంధిత వైద్య బిల్లులను CMRFకి పంపించగా రూ. 3,74,820 మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన చెక్కును జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర బాధిత కుటుంబ సభ్యులకు అందజేసినట్లు గురువారం తెలిపారు.