బుధవారం కడియం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై సుమారు 60 ఏళ్ల వృద్ధుడి మృతదేహం లభించింది. రాజమండ్రి రైల్వేస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె. నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడి ఎత్తు 5.5 అడుగులు. అతని గుర్తింపునకు సంబంధించిన ఇతర ఆధారాలు లభించలేదు. మృతుని వివరాలు తెలిసినవారు రాజమండ్రి జీఆర్పీ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు.