మహారాష్ట్రాకు చెందిన కేంద్ర రైల్వే మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నేత శ్రీరామ్ సాహెబ్ దాన్వే కడియం మండలం కడియపులంక శ్రీ సత్య దేవ నర్సరీని సందర్శించారు. బుధవారం ఆయన ఈ నర్సరీకి కుటుంబ సభ్యులతో విచ్చేసి పలు రకాల మొక్కలను పరిశీలించారు. వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. కడియం నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు.