కడియపులంకలో గురుపూజ మహోత్సవం

కడియం మండలం కడియపులంకలో గురువారం గురుపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కడియపులంక గ్రామంలో ఉన్న సాయిబాబా వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై సాయిబాబా వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధనలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్