కడియం మండలం కడియపులంకలోని హరి హర క్షేత్రాన్ని కర్ణాటక రాష్ట్ర మైనింగ్, జియాలజి & హార్టికల్చర్ శాఖ మంత్రి ఎస్. ఎస్ మల్లికార్జున శనివారం సందర్శించారు. హరి హర క్షేత్రం ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ ఆధ్వర్యంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.