కడియం: దాడి కేసులో వ్యక్తికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష

కడియం మండలం మాధవ రాయుడుపాలెం చైతన్యనగర్ కు చెందిన ముంజేటి సురేష్ మద్యం మత్తులో సీసాతో అదే గ్రామానికి చెందిన బొల్ల ధనుంజయపై దాడి చేశారు. దీనిపై గాయపడ్డ వ్యక్తి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై టి. కృష్ణసాయి కేసు నమోదు చేశారు. రాజమండ్రి 8వ అదనపు జిల్లా కోర్టులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి వై. బెన్నయ్య బుధవారం ముద్దాయికి 7 ఏళ్ల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్