కడియం మండలంలోని మురమండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మెగా టీచర్స్ & పేరెంట్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బొండాడ సుధ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో విద్యా కమిటీ చైర్మన్ కాటే జ్యోతిబాబు, ఉప సర్పంచ్ యర్రంశెట్టి వీరబాబు మాట్లాడారు. ప్రభుత్వం అందించే సదుపాయాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.