'కడియపులంక సర్పంచ్ ఎన్నికలకు వైసీపీ దూరం'

కడియం మండలం కడియపులంక సర్పంచ్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంటుందని ఆ పార్టీ మండల అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ గురువారం తెలిపారు. గతంలో కడియపులంక గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన మార్గాని అమ్మాణి ఆకస్మికంగా మరణించడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. దీంతో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సానుభూతి దృష్ట్యా, అమ్మాణి కుమార్తె అయిన పద్మావతిపై వైసీపీ నుంచి ఎవరినీ పోటీలో నిలపకూడదని సమిష్టిగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్