కడియం నర్సరీలను కర్ణాటక రాష్ట్ర మైనింగ్, జియాలజీ & హార్టికల్చర్ శాఖ మంత్రి ఎస్. ఎస్ మల్లికార్జున్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు సర్దార్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం అయ్యప్ప మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పలు మొక్కలను పరిశీలించి వాటి ప్రత్యేకతలు తెలుసుకున్నారు. కడియం నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.