కొప్పల దుర్గారావు నూతన వంగడాల సృష్టి అభినందనీయం: సోము వీర్రాజు

తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి రూరల్ పరిధిలోని బుర్రిలంక సప్తగిరి నర్సరీకి చెందిన కొప్పల దుర్గారావు నర్సరీ రంగంలో నూతన వంగడాలను సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. గురువారం ఆయన దుర్గారావుని సత్కరించి, విదేశాలలో ప్రఖ్యాతి చెందిన అనేక జాతుల మొక్కలు, ఫలవృక్షాలను వారు అభివృద్ధి చేస్తున్న తీరు అభినందనీయమని అన్నారు. వారు చేస్తున్న కృషిని గుర్తించి, భవిష్యత్తు తరాలకు వీరి ఆలోచనలు ఉపయోగకరమని తెలిపారు.

సంబంధిత పోస్ట్