తూ. గో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి బుధవారం బొమ్మూరు గ్రామ పంచాయతి కార్యాలయం వద్ద నల్సా పథకం–2024 కింద బాల్యవివాహాల నివారణ, పోక్సో చట్టం–2012, ఉచిత న్యాయ సహాయం, మధ్యవర్తిత్వం అంశాలపై న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాల్యవివాహాలు చేయడం వల్ల బాలబాలికల భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.