కడియం మండలం కడియపులంకలోని శ్రీ సత్యదేవా నర్సరీని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ శనివారం సతీ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీ అధినేత పుల్లా ఆంజనేయులు అంథురియం మొక్కతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు నర్సరీలోని వివిధ రకాల పండ్లు, పువ్వులు, ఆర్నమెంటల్ మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు. కడియం నర్సరీలు మరింత అభివృద్ధి చెందాలన్నారు.