కార్మికులకు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంఘీభావం

ఆంధ్ర పేపర్ మిల్లు కడియం యూనిట్‌లో ఒప్పంద కార్మికులు చేపట్టిన మెరుపు సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. వేతన సవరణ, పని నిబంధనల మెరుగుదల వంటి డిమాండ్లపై కార్మికులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్మికులకు సంఘీభావం ప్రకటించేందుకు శుక్రవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కార్మికుల దీక్షా శిబిరం వద్దకు వెళ్ళారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను యాజమాన్య దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్