అంబటి రాంబాబు పై ఎమ్మెల్యే గోరంట్ల ఆగ్రహం

మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలంతో దూషించడం హేయమైన చర్య అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ, అంబటి వెంటనే సీఎంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డు కల్తీ చేసి, దోపిడీ చేశారని కూడా ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్