రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. బుధవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.