రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రిక్షా కార్మికుడయ్యారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లో ఆదివారం జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూరల్ నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే కొంత దూరం రిక్షా తొక్కి పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు.