ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ, ప్రజలపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి శనివారం తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న అదనపు సుంకాన్ని తగ్గించారని, పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలపై అదనపు భారం పడకుండా బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె స్పష్టం చేశారు.