నల్లజర్ల: ఆ రోడ్డులో వెళ్తే జాగ్రత్త!

నల్లజర్ల (M) పరిధిలోని అనంతపల్లి నుంచి చోడవరం, తెలుగుచర్ల వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారిందని, దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణం నరకప్రాయంగా మారిందని, రోడ్డుకు ఇరువైపులా చెత్త వేయడంతో దుర్వాసన వస్తోందని, ఈ మార్గం డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోందని వాహనదారులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్