మే 3న జరగనున్న NEET UG–2026 ప్రవేశ పరీక్షలను జిల్లాలో ప్రశాంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని డి. ఆర్. ఓ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో, అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డి. ఆర్. ఓ టి సీతారామ మూర్తి అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు.