శ్రీరామగిరిలో నూతన పుష్కరిణి ప్రారంభం, జీయర్ స్వామి చేతుల మీదుగా

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మల దొడ్డి గ్రామంలో కార్తీక ద్వాదశి పర్వదినాన శ్రీరామగిరి వద్ద శ్రీశ్రీశ్రీ రామానుజఅహోబిలం జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో నూతన పుష్కరిణి ప్రారంభ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సప్తనది జలాలతో స్వామివారికి అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జీయర్ స్వామి వారి రాకతో శ్రీరామగిరి భక్త జన సందోహంతో మారుమ్రోగింది. స్వయంభువుగా వెలసిన మహాలక్ష్మి సమేత వల్మీక వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ రాధాకృష్ణ రమా సత్యనారాయణ సహిత శ్రీ కోదండరామ స్వామి వారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల సభ్యులు, యువతీ యువకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్