రాజమండ్రి: 5.05 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రవాహంతో ఉరకలేస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 10 అడుగులకు చేరింది. బ్యారేజీకి 5.19 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుండడంతో, అధికారులు 175 గేట్లు ఎత్తి 5.05 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. పంట కాలువలకు 13,580 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్