రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ ఘటనలో మొత్తం 20 మంది అడ్మిట్ కాగా, ఇప్పటివరకు 7 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. మిగిలిన 13 మంది బాధితులు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్నటి వరకు ఆరుగురు మృతి చెందగా, నేడు చౌడేశ్వర్ నగర్ కు చెందిన జి. సూర్యారావు (81) మృతి చెందినట్లు తెలిపారు.