రాజమండ్రి గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఈ సందర్భంగా ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 13,750 క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాల నిమిత్తం విడిచిపెడుతున్నట్లు గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ జి. శ్రీనివాస్ గురువారం తెలిపారు. మిగిలిన 2,32,160 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడిచిపెడుతున్నట్లు వెల్లడించారు.