ప్రముఖ సీనియర్ జర్నలిస్టు మండేల శ్రీరామమూర్తి పెద్ద కుమార్తె గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె మరణం ఎంతగానో కలచివేసిందని మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం అన్నారు. విషయం తెలుసుకున్న మంత్రి రాజమహేంద్రవరం లోశ్రీరామమూర్తి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.