రాజమండ్రి: 'లో ఓల్టేజ్ సమస్య పరిష్కరించాలి'

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామంలోని జీపీఆర్ కాలనీలో లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని రూరల్ బీజేపీ కో కన్వీనర్ యానాపు ఏసు కోరారు. ఈ సందర్భంగా గురువారం బీజేపీ రూరల్-3వ మండల బీజేపీ అధ్యక్షులు షేక్ సాజిద్ ఆధ్వర్యంలో ఏఈ గీత భవానికి వినతి పత్రం అందించారు. లో వోల్టేజ్ సమస్యతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలపై భారం పడకుండా సమస్యలు పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్