రాజమండ్రి రూరల్ మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం వారు భేటీ అయ్యి పలు రాజకీయ అంశాలపై చర్చించారు. అనంతరం గురువారం కడియంలో నిర్వహించిన 'సుపరిపాలనకు తొలి అడుగు' కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన అభివృద్ధిని స్థానిక ప్రజలకు వివరించారు.