రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో శుక్రవారం ఉదయం నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా మంజూరైన 24 పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.