రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామ సభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి కాశీ విశ్వనాధ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రూరల్ మండలం MPDO సునీల్ ఆర్మ్ స్టాంగ్ పాల్గొని, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ సభలో రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, పంచాయతీ సిబ్బంది కూడా పాల్గొన్నారు.