రాజమండ్రి: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా చదువుపై దృష్టి సారించాలని జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీలక్ష్మీ అన్నారు. గురువారం రాజమండ్రిలోని ఆర్యపురంలో ఉన్న శ్రీ నన్నయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని, దీనివల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు.

సంబంధిత పోస్ట్