తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటరానితనం కొనసాగుతోందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో దళితులకు అధిక ప్రాధాన్యత ఉండేదని, కానీ ఇప్పుడు వారిని చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. అలాగే కూటమి ప్రభుత్వం పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలను నివృత్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.