రాజమండ్రి: ధవళేశ్వరం వద్ద గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద శుక్రవారం గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ సందర్భంగా 2, 94, 323 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు ఈఈ జి. శ్రీనివాస్ తెలిపారు. సాగునీటి కోసం తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 13, 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగిలిన నీటిని 175 గేట్ల ద్వారా 2, 83, 042 క్యూసెక్కులు దిగువకు విడిచిపెడుతున్నారు.

సంబంధిత పోస్ట్