ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్యం పోర్టల్‌లో రిజ్యూమ్ బిల్డింగ్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి. జి. డి. మురళి శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అభ్యర్థులు తమ వృత్తి అనుభవం, నైపుణ్యాలు, శిక్షణ వివరాలను పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా ఉద్యోగావకాశాలు, మెరుగైన వేతనాలకు అనుగుణంగా ప్రామాణిక రిజ్యూమ్‌ను సిద్ధం చేసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.