రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో, మున్సిపల్ కార్మికుల పని ఒత్తిడి తగ్గించేందుకు కార్మికుల సంఖ్యను పెంచాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు కోరారు. శుక్రవారం ఉదయం రాజమండ్రిలోని 1వ వార్డులో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, పెరుగుతున్న జనాభా దృష్ట్యా మునిసిపల్ శానిటేషన్ కార్మికుల సిబ్బందిని పెంచాలని విజ్ఞప్తి చేశారు.