గోకవరం-కొత్తపల్లి మార్గంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే గోకవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.