రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ చౌదరి బుధవారం బొమ్మూరులోని డాక్టర్ బి.ఆర్.ఏ జి.ఎం.ఆర్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణంలో క్రీడా మైదానం అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తన సొంత నిధుల నుండి లక్ష రూపాయల నగదును ప్రిన్సిపల్ ఏ. మురళికి అందించారు. సమాజంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే నేటి సమాజానికి ఆదర్శంగా గోరంట్ల నిలిచారని పలువురు ప్రశంసించారు.