రాజమండ్రిలోని వైసీపీ కార్యాలయంలో శనివారం సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి అయిన సావిత్రిబాయి పూలే మహిళల చదువు కోసం ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.