తొలకరి వర్షాలకు సిద్ధంగా విత్తన గుళికలు

రాజమండ్రి రూరల్ మండలం తొరేడు గ్రామంలో శుక్రవారం ఏపీసీఎన్‌ఎఫ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు విత్తన గుళికల తయారీ కార్యక్రమం జరిగింది. PMDS, రైతు కంఫర్ట్ బ్లాక్‌లలోని 20 ఎకరాల పరిధిలో మినుములు, పెసలు, సెనగలు, బొబ్బర్లు, గోంగూర వంటి పంటలకు సంబంధించిన 100 కిలోల విత్తనాలతో గుళికలు తయారు చేశారు. ఈ గుళికల వాడకం వల్ల విత్తనాలు ఆరోగ్యంగా మొలకెత్తడంతో పాటు, తెగుళ్లను నివారించవచ్చని, తొలకరి వర్షాల్లోనూ విత్తనాలు పాడవకుండా సులభంగా మొలకెత్తేందుకు ఇది దోహదపడుతుందని వివరించారు.

సంబంధిత పోస్ట్