సీనియర్ కార్యకర్త పైడిరాజు మృతి పట్ల దిగ్భ్రాంతి

రాజమండ్రి రూరల్ మండలం సాటిలైట్ సిటీ గ్రామానికి చెందిన సీనియర్ కార్యకర్త ఎలుసూరి పైడిరాజు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వార్త విని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన సాటిలైట్ సిటీ గ్రామంలోని పైడిరాజు నివాసానికి వెళ్లి, పార్థివ దేహానికి పార్టీ జెండా కప్పి, పూలమాలతో నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన అందించిన సేవలు ఎనలేనివని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే అన్నారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్