రాజమండ్రి రూరల్ మండలం వెంకటనగరంకి చెందిన వైసీపీ నాయకుడు మోత రమేష్ కారును మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. విషయం తెలుసుకున్న జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కు సమాచారాన్ని తెలియజేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తనయుడు చెల్లుబోయిన నరేన్ బుధవారం సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.