రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు SVPS ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారుల సూచనల మేరకు, ప్రజలు అవసరం లేకుండా ఇళ్ల బయటకు రావద్దని, పిల్లలను ఒంటరిగా బయటకు పంపించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. పులి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దీంతో ఆ ప్రాంతంలో అధికారులు 'హై అలర్ట్' ప్రకటించారు.