తూ.గో: మళ్లీ పోలీసులకు చిక్కాడు!

ధవళేశ్వరం ఎర్ర కొండ రైల్వే ట్రాక్ వద్ద బుధవారం గుబ్బల ఆశిష్ అనే వ్యక్తిని CI టి. గణేశ్ అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. లక్ష విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆశిష్‌పై ఇప్పటికే 12 క్రిమినల్ కేసులు, రౌడీ షీట్, పీడీ యాక్ట్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా అతని తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్