గోకవరం మండలంలో పులి సంచరిస్తోందన్న పుకార్లతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో రాయవరం వద్ద పట్టుబడిన పులిని మారేడుమిల్లి అడవుల్లో విడిచిపెట్టగా, అది మళ్లీ జనావాసాల్లోకి వచ్చిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే, అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి పులి జాడ లేదని స్పష్టం చేశారు. స్థానికులు కొందరు సారా వ్యాపారులు తమ అక్రమ వ్యాపారాల కోసం ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని అనుమానిస్తున్నారు.