తూ.గో: కూలికి వెళ్తుందని భార్యను నరికి చంపేశాడు..!

సీతానగరం మండలం బొబ్బిలి లంకలో సీతారామరాజు (పండు) తన భార్య లత (35), అత్త లక్ష్మి (52)ను కత్తితో నరికి చంపిన దారుణం సోమవారం రాత్రి జరిగింది. కూలీ పనికి వెళ్లడం అవమానంగా భావించి ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించి, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.

సంబంధిత పోస్ట్