రాజమండ్రి రూరల్ మండలంలోని మోరంపూడి ఫ్లై ఓవర్ కింద బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ పి. కాశీవిశ్వనాథం సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురికి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు బొమ్మూరు పోలీస్ స్టేషన్ కు 9440796533 నంబర్ లో సంప్రదించాలని కోరారు.