కడియంలోని ఓ మద్యం షాప్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. దుండగులు షాప్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, కౌంటర్‌లోని నగదుతో పాటు పెద్ద మొత్తంలో మద్యం సీసాలను అపహరించుకుపోయారు. ఈ ఘటనపై బుధవారం దుకాణ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.