రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, ఇళ్లు లేని అర్హులందరికీ త్వరలోనే టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వర్షాకాలం నాటికి మెయిన్ డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ పీ. వీ రామలింగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.