కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డు పై చేస్తున్న విష ప్రచారం చేయడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ధవళేశ్వరం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర తిరుమల ప్రసాదాన్ని చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు.