సీతానగరం మండలం కూనవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కూనలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాసేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.