కొత్తపల్లిలో త్రుటిలో తప్పిన ప్రమాదం

రాజానగరం నుంచి వాకతిప్ప పార్సెల్ సెంటర్ కు వెళ్లాల్సిన ఐషర్ వ్యాన్ డ్రైవర్ కు చిరునామా తెలియక కొత్తపల్లి ఊర చెరువు సెంటర్ వరకు వచ్చాడు. గురువారం ఉదయం రోడ్డు పక్కన వంగిన చెట్టు కొమ్మలను గమనించకపోవడంతో వ్యాన్ నేరుగా చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు, సమీప దుకాణాలకు నష్టం జరగలేదు. అయితే, రోడ్డుకు అడ్డంగా వ్యాన్ నిలిచిపోవడంతో ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సంబంధిత పోస్ట్