శుక్రవారం అర్ధరాత్రి రాజానగరం కొత్త కాలనీకి చెందిన పెంకే తేజ, జానకి రామ్‌లు బైకుపై ప్రయాణిస్తుండగా, జాతీయ రహదారి పక్కన ఉన్న ఇండియన్ ఆయిల్ బంకు వద్దకు వచ్చేసరికి ఒకరి బైకు మరొకరిని ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి, క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.